అమెరికాలో భారతీయ మహిళ దొంగతనానికి పాల్పడింది. టార్గెట్ స్టోర్‌లో రూ. లక్షకుపైగా విలువైన వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడింది. బాడీక్యామ్ వీడియోలో చోరీకి పాల్పడిన ఘటన రికార్డయ్యింది. అమెరికాను సందర్శించేదుకు వచ్చిన ఆమెను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.
భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియను క్షమించొద్దని.. ఆమెను శిక్షించాల్సిందేనని తలాల్ అబ్దో మోహదీ సోదరుడు అబ్దుల్ఫత్తా మెహది డిమాండ్ చేశాడు. నేరస్థురాలిని బాధితురాలిగా చూడొద్దని కోరాడు. ఎట్టి పరిస్థితుల్లో ‘బ్లడ్‌మనీ’(పరిహారం)ని అంగీకరించబోమని తేల్చి చెప్పాడు.
కునాల్ కమ్రా.. స్టాండప్ కమెడియన్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాపులర్ అయ్యారు. ఇక ఆయనపై మహారాష్ట్రలో పలు కేసులు నమోదయ్యాయి.
ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
పహల్గామ్ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
ఫోన్ టాపింగ్ కేసులో నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. మంగళవారం ప్రభాకర్ రావును సిట్ టీమ్ సుదీర్ఘంగా విచారించింది. ప్రభాకర్‌రావు సెల్‌ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు.
మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావును అక్రమాస్తుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.