Maharashtra: మాతృత్వానికి మాయని మచ్చ.. మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
- మహారాష్ట్రలో అమానుష ఘటన
- మాతృత్వానికి మాయని మచ్చ
- మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మాతృత్వానికే మాయని మచ్చగా మిగిలే ఘోర అమానుష సంఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణం చేస్తున్న గర్భవతికి అకస్మాత్తుగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే మగబిడ్డకు జన్మినిచ్చింది. అనంతరం ఒక గుడ్డలో చుట్టి బస్సులోంచి విసిరేసింది. డ్రైవర్ అద్దంలోంచి చూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Pahalgam Attack: 26 మందిని చంపాక 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు.. ముష్కరులు ఇలా ఎందుకు చేశారంటే..!
Also Read
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
రితికా ధేరే(19) అనే యువతి, భర్త అని చెప్పుకునే అల్తాఫ్ షేక్‌తో కలిసి సంత్ ప్రయాగ్ ట్రావెల్స్‌లో స్లీపర్ కోచ్ బస్సులో పూణె నుంచి పర్భానీకి వెళ్తున్నారు. రితికా గర్భవతిగా ఉంది. ఉన్నట్టుండి రితికాకు నొప్పులు ప్రారంభం అయ్యాయి. ప్రసవ వేదనకు గురైన ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శిశువును ఒక గుడ్డ ముక్కలో చుట్టి బస్సులోంచి విసిరేశారు. అయితే బస్సులో ఎగువ, దిగువ బెర్తులు ఉన్నాయి. అయితే కిటికీలోంచి ఏదో విసిరేసినట్లుగా డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సు ఆపి ఆరా తీయగా.. ప్రయాణం కారణంగా భార్యకు వాంతులు అయ్యాయని భర్త షేక్ చెప్పాడు. అయితే రోడ్డుపై స్థానికుడు ఉండడంతో బస్సులోంచి ఏదో పడినట్లుగా గమనించాడు. వెంటనే వెళ్లి చూడగా మగ శిశువు అని తెలుసుకుని షాక్ అయ్యాడు. వెంటనే 112 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేశాడు.
ఇది కూడా చదవండి: Phone Tapping: నేడు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్‌రావు..
పెట్రోలింగ్ విధుల్లో ఉన్న స్థానిక పోలీసుల బృందం బస్సును అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసి ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన తర్వాత రితికా, షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బిడ్డను పెంచలేకపోవడంతోనే శిశువును విసిరేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే శిశువును రోడ్డుపై పడేయడంతో చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితికా, షేక్ ఇద్దరూ పర్భానీకి చెందినవారని.. గత ఒకటిన్నర సంవత్సరాలుగా పూణేలో నివసిస్తున్నారని చెప్పారు. భార్యాభర్తలుగా చెలామణి అవుతున్నారని.. అందుకు వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఎలాంటి పత్రాలు కూడా చూపించలేదని పోలీస్ అధికారి చెప్పారు. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పత్రి-సేలు రోడ్డులో జరిగిందని.. స్థానిక పౌరుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: మలక్‌పేట్ కాల్పులపై కొనసాగుతున్న దర్యాప్తు.. నిందితులు ఏం చేశారంటే..!
రితికా, షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. పర్భానీలోని పత్రి పోలీస్ స్టేషన్‌లో జంటపై BNS సెక్షన్ 94 (3), (5) (మృతదేహాన్ని రహస్యంగా పారవేయడం ద్వారా జననాన్ని దాచిపెట్టడం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులకు నోటీసులు అందజేశామని.. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?