బంగారం ప్రియులకు శుభవార్త. నిన్నామొన్నటిదాకా ఆకాశాన్నింటిన గోల్డ్ ధరలు దిగొస్తున్నాయి. వరుసగా ధరలు తగ్గుతున్నాయి. దీంతో గోల్డ్ లవర్స్ ఆనందపడుతున్నారు. నేడు తులం గోల్డ్ ధర రూ. 490 తగ్గింది. అలాగే సిల్వర్ ధర కూడా ఉపశమనం కలిగించింది. కిలో వెండి ధరపై రూ.1,000 తగ్గింది. ఇక బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి.. రూ.91,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి.. రూ.99, 280 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Odisha: విద్యార్థిని ఆత్మహత్యపై ఉవ్వెత్తిన నిరసన జ్వాలలు.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగం
అలాగే సిల్వర్ ధరలు కూడా తగ్గాయి. బుధవారం రూ.1,000 తగ్గి.. రూ.1,14, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.1, 24, 000 అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి రూ.1, 14, 000 దగ్గర సేల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Maharashtra: మాతృత్వానికి మాయని మచ్చ.. మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి