Odisha: విద్యార్థిని ఆత్మహత్యపై ఉవ్వెత్తిన నిరసన జ్వాలలు.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగం
- విద్యార్థిని ఆత్మహత్యపై ఒడిశాలో ఉవ్వెత్తిన నిరసన జ్వాలలు
- టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఇక భువనేశ్వర్‌లో అసెంబ్లీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగించారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఇక బంద్ కారణంగా బాలసోర్ దగ్గర కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రక్కులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మాతృత్వానికి మాయని మచ్చ.. మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ (అటానమస్) కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపిస్తూ క్యాంపస్‌లో తనను తాను నిప్పంటించుకుంది. విద్యార్థిని జూలై 14న ఎయిమ్స్ భువనేశ్వర్‌లో 95 శాతం కాలిన గాయాలతో మరణించింది.
ఇది కూడా చదవండి: Pahalgam Attack: 26 మందిని చంపాక 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు.. ముష్కరులు ఇలా ఎందుకు చేశారంటే..!
తనపై హెచ్‌వోడీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థిని పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపాల్ మరియు కళాశాల అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో నిప్పంటించుకుంది. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. కాలేజ్ ఫ్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Fauja Singh: కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి.. నిందితుడు ఎన్నారై అరెస్ట్
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, వైద్య బృందం అన్ని రకాల మద్దతు అందించినప్పటికీ, బాధితురాలిని ప్రాణాలతో కాపాడలేకపోయామని అన్నారు. ఈ కేసులో దోషులందరికి శిక్ష పడుతుందని, దీనిపై తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు జారీ చేశానని చెప్పారు. ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తుందని వెల్లడించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
#WATCH | Bhubaneswar, Odisha | Police detain the BJD workers who are protesting over the Balasore student's death by self-immolation.
Biju Janata Dal is also observing a Balasore bandh in protest over a Balasore student's death by self-immolation. pic.twitter.com/5HTZIETJ0q
— ANI (@ANI) July 16, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!