టర్బన్డ్ టోర్నడోగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ అథ్లెట్ ఫౌజా సింగ్(114) సోమవారం జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో మరణించారు. జలంధర్-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై కారు ఢీకొని ఫౌజా సింగ్ కన్నుమూశారు.
దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్ ప్రభుత్వంలో పునర్వ్యవస్థీకరణ చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేర్పులు.. మార్పులకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ రాజీనామా చేశారు. మంగళవారం ష్మిహాల్ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంతో పాటు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం.. టేకాప్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది.
తమిళనాడులో ఇటీవల పోలీసుల దెబ్బలు తాళలేక సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. విపక్షాల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి.. పోలీసులను సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పింది.
భారతీయులకు అత్యంత ఇష్టమైన ఆహారాల్లో జిలేబీ, సమోసాలు, లడ్డూలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కూడా. అలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించిందంటూ వార్తలు హడావుడి చేశాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దీంతో ట్రంప్‌నకు సహనం నశించింది. ఎన్ని సార్లు చెప్పినా పుతిన్ మాట వినడం లేదని కోపం కట్టలు తెంచికొచ్చినట్లుంది.
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం చైనాకు వెళ్లారు.
దేశంలో రోజురోజుకూ నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ప్రేమికుడితో సుఖం కోసం ఇల్లాల్లు రక్తసంబంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటి దాకా కట్టుకున్నవాళ్లను కడతేర్చిన అర్ధాంగులు.. ఇప్పుడు కన్నపేగు పంచుకుని పుట్టిన బిడ్డలను కూడా కడతేర్చేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి భారత్ జోడ్యాత్రలో నమోదైన కేసులో ఊరట లభించింది. 2020, డిసెంబర్లో భారత్ జోడ్యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు దాఖలైంది