అగ్రరాజ్యం అమెరికాలో వరదల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న టెక్సాస్, మెక్సికోలను వరదలు ముంచెత్తాయి. టెక్సాస్‌లో 100 మందికి పైగా చనిపోగా.. మెక్సికోలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశాలో జరిగిన ఘోర సంఘటనను మరువక ముందే బెంగళూరులో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులపై తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, బ్లాక్ మెయిల్ చేశారని కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేశారు. ఉరిశిక్ష నిలిపివేతకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ ప్రభుత్వ పెద్దలతో భారత ప్రభుత్వం మంతనాలు చేస్తోంది. ఎలాగైనా ఉరిశిక్షను నిలిపివేసేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఉక్రెయిన్‌పై 50 రోజుల్లోగా రష్యా యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
పూణె కారు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కుర్రాళ్లు.. వేగంగా దూసుకెళ్లి ఇద్దరు టెకీల మరణానికి కారణం అయ్యారు. అయితే నిందితులకు గంటల వ్యవధిలోనే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లును ప్రధాన మిత్రపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చాక బాధిత కుటుంబాల్లో ఆవేదన మొదలైంది. రెండు ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా 15 పేజీల ప్రాథమిక నివేదికలో తేటతెల్లమైంది.
యెమెన్‌లో భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై కేంద్రం చేతులెత్తేసింది. ఉరిశిక్షను నిలిపివేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. దౌత్యపరంగా చేపట్టాల్సిన అన్ని అయిపోయాయని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది.
ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తనింబర్ దీవుల ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదికపై ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ స్పందించారు. ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి సమస్య లేనట్లుగా తెలిపారు. ఇంజిన్‌లో గానీ.. స్విచ్‌ల్లో గానీ ఎలాంటి నిర్వహణ సమస్యలు లేవని తేల్చి చెప్పారు.