భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియను క్షమించొద్దని.. ఆమెను శిక్షించాల్సిందేనని తలాల్ అబ్దో మోహదీ సోదరుడు అబ్దుల్‌ఫత్తా మెహది డిమాండ్ చేశాడు. నేరస్థురాలిని బాధితురాలిగా చూడొద్దని కోరాడు. ఎట్టి పరిస్థితుల్లో ‘బ్లడ్‌మనీ’(పరిహారం)ని అంగీకరించబోమని తేల్చి చెప్పాడు. 2017లో హత్యకు గురైన తలాల్ అబ్దో మోహదీ కేసులో బుధవారం నిమిషా ప్రియ ఉరి కంభానికి ఎక్కాలి. కానీ చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా పడింది. భారత ప్రభుత్వం.. యెమెన్ ప్రభుత్వంతో అత్యున్నత స్థాయిలో మంతనాలు జరుపుతోంది. దీంతోనే నిమిషాకు ఉరిశిక్ష పడలేదు. అయితే ఉరిశిక్ష వాయిదా పడడంతో అబ్దుల్‌ఫత్తా మెహది స్పందిస్తూ.. నర్సుకు ఉరిశిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాడు. కావాలనే ఉద్దేశం పూర్వకంగా విషయాలను భారతీయ మీడియా వక్రీకరిస్తోందని తెలిపాడు. దోషిగా తేలిన వారిని బాధితురాలిగా చిత్రీకరించడమేంటి? అని అబ్దేల్‌ఫట్టా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి: Kunal Kamra: భార్య లేదుగానీ.. విడాకులు తీసుకున్నట్లుంది.. కునాల్ కమ్రా కీలక వ్యాఖ్యలు
భారత ప్రభుత్వం.. సౌదీ అరేబియా ద్వారా యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. కీలక మైన వ్యక్తుల మధ్యవర్తిత్వం ద్వారా ఉరిశిక్ష వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉరిశిక్షను వాయిదా వేయాలనే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక నిందితురాలి కుటుంబం నుంచి బాధితుడి కుటుంబానికి క్షమాపణ చెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిమిషాను బాధిత కుటుంబం క్షమిస్తే.. సమస్య ముగిసినట్లే. కానీ బాధిత కుటుంబం మాత్రం అందుకు అంగీకరించట్లేదు. ఇక బ్లడ్ మనీ ఇచ్చేందుకు నిందితురాలి కుటుంబం సిద్ధమైంది. అందుకు అంగీకరిస్తే సమస్యకు పరిష్కారం దొరినట్లే. ఇక కేరళ బిలియనీర్ ఎంఏ యూసుఫ్ అలీ అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. బ్లడ్ మనీ అంటే బాధిత కుటుంబానికి అందించే పరిహారాన్ని బ్లడ్ మనీ అంటారు. ఇది షరియా చట్టం ప్రకారం ఆమోదించబడిన ఆచారం.
ఇది కూడా చదవండి: Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన గోల్డ్ ధరలు
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ 2017, జూలైలో యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో అరెస్టు అయింది. మరొక నర్సు సహాయంతో మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అతని శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్‌లో పడవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నిమిషా ఈ ఆరోపణలను కోర్టులో సవాలు చేసింది. కానీ కోర్టులు ఆమె అప్పీళ్లను తోసిపుచ్చాయి. చివరికి ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చింది. అనంతరం న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది.
నిమిషా ప్రియ.. 2008 నుంచి యెమెన్‌లో నర్సుగా పనిచేస్తోంది. 2011లో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్‌తో కలిసి యెమెన్ దేశానికి వెళ్లింది. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తెతో కేరళకు తిరిగి వచ్చేశాడు. నిమిషా మాత్రం యెమెన్‌లోనే ఉండిపోయింది. అనంతరం ఆమె యెమెన్ జాతీయుడితో కలిసి నర్సింగ్ హోమ్ ప్రారంభించింది. అయితే ఆమెపై మెహదీ అఘాయిత్యం చేయబోయాడు. అనేక మార్లు శారీరికంగా వేధించాడు. అంతేకాకుండా పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నాడు. అయితే పాస్‌పోర్టును తిరిగి పొందే క్రమంలో మత్తు మందులు ఇచ్చానని.. కానీ అతడు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే చనిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైలులో ఉంది.