Ukraine-Russia: రష్యా డ్రోన్ దాడి.. సముద్రంలో ఉక్రెయిన్ భారీ నౌక పేల్చివేత
- రష్యా డ్రోన్ దాడి
- సముద్రంలో ఉక్రెయిన్ నౌక పేల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య ఓ వైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరు దేశాధి నేతలతో ఇప్పటికే ట్రంప్ శాంతి చర్చలు జరిపారు. కానీ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. ఇంతలోనే రష్యా భీకరదాడులు చేస్తోంది. ఇటీవల కాలంలో భారీ దాడులు చేయగా.. తాజాగా సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన అది పెద్ద నౌకను డ్రోన్‌తో పేల్చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Survey Predicts: లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే
Also Read
రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్స్ నిఘా కోసం డానుబే నదిలో ఉంచిన పెద్ద నౌకను రష్యా డ్రోన్‌తో దాడి చేసి పేల్చేసింది. దీంతో భారీ విస్ఫోటనంతో పేలిపోయి ముక్కలైంది. సముద్రంపై రష్యా డ్రోన్ ప్రయోగించడం ఇదే తొలిసారి. దశాబ్ద కాలం క్రితం నుంచి ఈ నౌక ఉంటుంది. డ్రోన్ దాడిలో నౌక పేలిపోయిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నౌకలో ఉన్న ఒకరు చనిపోగా.. అనేక మంది గాయపడ్డారని ఉక్రెయిన్ నేవీ అధికారి తెలిపారు. తప్పిపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. సింఫెరోపోల్ 2019లో ప్రారంభించబడిందని.. రెండు సంవత్సరాల తర్వాత ఉక్రెయిన్ నావికాదళంలో చేరినట్లుగా చెప్పారు. 2014 నుంచి కీవ్ ప్రయోగిస్తున్న అతి పెద్ద నౌకగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Cloudburst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. 2 జిల్లాల్లో పలువురు జలసమాధి!
ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి దాడులు ఉధృతం అవుతున్నాయి. బుధవారం రాత్రి కీవ్ సహా పలు నగరాలపై మాస్కో 598 డ్రోన్లు, 31 క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు మృతి చెందగా.. 48 మందికి గాయాలయ్యాయి.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిపారు కానీ.. ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో చర్చలు జరిపారు. షరతులు కారణంగా చర్చలు ఫలించలేదు. వెనువెంటనే జెలెన్‌స్కీ, యూరోపియన్ దేశాధినేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫలిస్తాయో లేదో ఇంకా తెలియదు.
#Russia marine drone takes down a #Ukraine intelligence/reconnaissance ship in the River #Danube
Hurry to the Eyes and Ears doctors before the insurance expires#DPRK#UK#Germany#France pic.twitter.com/lezgJ7FeCT
— Devi Rhamesz (@ChrliesWarchest) August 28, 2025
- Tags
- drone attack
- Putin
- Russia
- sea
- trump
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!