Trump: అలాగైతే అమెరికా నాశనమే.. టారిఫ్ తీర్పుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- అలాగైతే అమెరికా నాశనమే
- టారిఫ్ తీర్పుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఫెడరల్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అలాగైతే అమెరికా పూర్తిగా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. సుంకాలను తొలగించడం అమెరికా వినాశనానికి దారి తీస్తుందని తెలిపారు. తీర్పు వెలువరించిన న్యాయమూర్తులపై ధ్వజమెత్తారు. వారంతా ‘రాడికల్ లెఫ్ట్ గ్రూప్’ అంటూ ముద్ర వేశారు. ఇక భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ధైర్యంపై మాత్రం ప్రశంసలు కురిపించారు. ఆ న్యాయమూర్తి ఒబామా నియమించిన డెమొక్రాట్ అని అభివర్ణించారు. ఆ జడ్జి యూఎస్‌ను ప్రేమిస్తున్నారని.. అంతేకాకుండా గౌరవిస్తున్నారని.. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: SCO Summit: నేడే మోడీ-పుతిన్ కీలక భేటీ.. కీలకంగా మారనున్న అమెరికా టారిఫ్!
Also Read
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో సుంకాలు కారణంగా ఆయా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని శుక్రవారం అమెరికా ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు తీర్పు వెలువరిచింది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఓపెన్-ఎండ్ సుంకాలను అమలు చేసే అధికారం ట్రంప్‌కు లేదని న్యాయస్థానం పేర్కొంది. ఇక సుంకాలను రద్దు చేసినప్పటికీ.. అక్టోబర్ 14 వరకు మాత్రం కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: GAMA Awards : ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ చిత్రంగా పుష్ప 2
భారత్‌పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఆసియాలో భారత్‌పైనే మాత్రమే 50 శాతం సుంకం విధించారు. చైనా మీద మాత్రం ప్రేమ చూపించారు. చైనా కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనా మీద మాత్రం విధించలేదు.

- Tags
- america
- Court Ruling
- india
- tariffs
- trump
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?