PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
- పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్
- షెహబాజ్ షరీఫ్‌ను పట్టించుకోని ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో సమావేశంలో పాక్ ప్రధానికి ప్రధాని మోడీ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
చైనా వేదికగా సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ముందుగా దేశాధినేతలంతా గ్రూప్ ఫొటో దిగారు. ఆయా దేశాధినేతలంతా వరుసగా నిలబడ్డారు. వరుస క్రమంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా నిలబడి ఉన్నారు. ప్రధాని మోడీ తన స్థానంలో నిలబడేందుకు షెహబాజ్ షరీఫ్‌ను దాటుకుని వెళ్లాలి. కానీ మోడీ మాత్రం పాక్ ప్రధాని వైపే చూడలేదు. పుతిన్‌తో ఏదో మాట్లాడుతున్నట్లుగా దాటుకుని వెళ్లిపోయారు. ఇక గ్రూప్ ఫొటో దిగిన తర్వాత కూడా షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడేందుకు కూడా మోడీ ఇష్టపడలేదు. పుతిన్-జిన్‌పింగ్‌తో సంభాషిస్తూ.. పాక్ ప్రధాని వెళ్లిపోగానే వారి వెనుక నెమ్మదిగా మోడీ వెళ్లారు.ఇక మోడీ-పుతిన్-జిన్‌పింగ్ చాలా కులాసాగా మాట్లాడుకుంటూ కనిపించారు. చాలా సేపు నవ్వుకుంటూ సంభాషించుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 26 మందిని మతం పేరుతో పొట్టనపెట్టుకున్నారు. అనంతరం భారత ప్రభుత్వం సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా వీసాలను రద్దు చేసింది. అటరీ సరిహద్దు నిలిపివేసింది. ఇక మే 7 ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదలను హతం చేయగా.. అలాగే పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. దీంతో అమెరికాతో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్-రష్యా-చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. సరిహద్దు ఘర్షణల తర్వాత చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తిరిగి 7 ఏళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్లారు.

తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!