అమెరికాలోని హూస్టన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ నీట మునిగిపోయి. పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇది కూడా చదవండి: Trump: అలాగైతే అమెరికా నాశనమే.. టారిఫ్ తీర్పుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
తీవ్ర తుఫాన్ కారణంగా ఆదివారం కుండపోత వర్షం కురిసింది. హూస్టన్, దాని పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వాగులు, ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్దారు. వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో రోడ్లపై వదిలిపెట్టి షెల్టర్లలోకి వెళ్లి రక్షణ పొందారు.
ఇది కూడా చదవండి: Lokah : కేరళలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న కొత్తలోక
ఇక అండర్‌పాస్‌లు నదులను తలపించాయి. దీంతో జాతీయ వాతావరణ శాఖ ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నగరంలో అనే ప్రాంతాల్లో వరదలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇక ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. పసాదేనా, పెర్లాండ్, డీర్ పార్క్, సౌత్ హ్యూస్టన్, బెల్లైర్, వెస్ట్ యూనివర్సిటీ ప్లేస్, గలీనా పార్క్, జాసింటో సిటీ, గ్రేటర్ ఈస్ట్‌వుడ్, నియర్ నార్త్‌సైడ్, మిడ్‌టౌన్, ఫోర్త్ వార్డ్ వంటి డౌన్‌టౌన్‌లు అధిక ప్రమాదం పొంచి ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
FLASH FLOODING
HAPPENING NOW SOUTH HOUSTON NEAR MYKAWA AND 610 South @abc13houston @JeffLindner1@TxStormChasers @spann @NWSHouston #houwx #htx #TXWX #hounews pic.twitter.com/Pzf5h4AuAv— Storm Chaser Houston (@StormChaserHTX) August 31, 2025
FLOODING IN SOUTH HOUSTON
Wayside and 45 S@abc13houston @TxStormChasers @spann @NWSHouston #houwx #htx #TXWX #hounews pic.twitter.com/m3Xpqy636k— Storm Chaser Houston (@StormChaserHTX) August 31, 2025