Bihar: తేజస్వి యాదవ్ భార్యపై ఓ మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు.. బీహార్‌లో ఆర్జేడీ నేతల ఆందోళన
- తేజస్వి యాదవ్ భార్యపై ఓ మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు
- బీహార్‌లో ఆర్జేడీ నేతల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాక ముందే నేతలంతా మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు-ప్రతి విమర్శలు సహజమే. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి రాద్ధాంతం చేస్తున్నారు. ఇటీవల ఓ కాంగ్రెస్ కార్యకర్త.. ప్రధాని మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భార్యపై ఆ పార్టీ మాజీ నేత రాజ్‌బల్లభ్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్జేడీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దిష్టిబొమ్మలను తగలబెట్టారు.
ఇది కూడా చదవండి: JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
Also Read
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
నవాడా జిల్లాలో ఒక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ఆర్జేడీ మాజీ నేత రాజ్‌బల్లభ్ యాదవ్.. తేజస్వి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని పరుష పదజాలం ప్రయోగించారు. తేజస్వి యాదవ్.. ‘‘బీహార్ అమ్మాయిని కాకుండా.. వేరే రాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఓట్ల కోసమే కులాన్ని ఉపయోగిస్తారా? పెళ్లి విషయంలో మాత్రం కులాన్ని పరిగణనలోకి తీసుకోరా?, తేజస్వి యాదవ్ వివాహం ఎక్కడ జరిగింది? హర్యానా? లేదా పంజాబ్‌లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? స్త్రీని తెచ్చుకున్నాడా? లేదంటే జెర్సీ ఆవును తెచ్చుకున్నాడా? యాదవ్ సమాజంలో అసలు అమ్మాయిలే లేరా?’’ అంటూ తేజస్వి యాదవ్ భార్య పేరు ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేశాడు.
ఇది కూడా చదవండి: Rekha Gupta-AAP: ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త హాజరు.. ఆప్ తీవ్ర విమర్శలు
తాజాగా రాజ్‌బల్లభ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్జేడీ పార్టీ మహిళా విభాగం నిరసనలు నిర్వహించింది. దిష్టిబొమ్మలను తగలబెట్టారు. రాజ్‌వల్లభ్ వ్యాఖ్యలు అసభ్యకరమైనవి.. ఆమోదయోగ్యం కాదని ఖండించారు. నవాడా మాజీ ఎమ్మెల్యే, ఆర్జేడీ సీనియర్ నాయకుడు కౌశల్ యాదవ్ మీడియాతోమాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు రాజ్‌శ్రీ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలు దళిత వర్గాలపై దాడిగా అభివర్ణించారు. లాలూ ప్రసాద్ యాదవ్ దేశంలోని అగ్ర నాయకులలో ఒకరని.. వెనుకబడిన, దళితుల నాయకుడు అని చెప్పారు. రాజ్‌శ్రీ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలు సమాజాన్ని బాధపెట్టాయన్నారు. సమాజం గుండె పగిలిపోయిందని పేర్కొన్నారు. పదేళ్ల క్రితం అత్యాచారం కేసులో జైలుకెళ్లిన వ్యక్తి.. స్త్రీల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అని మండిపడ్డారు.
తేజస్వి యాదవ్ 2021లో తన బ్యాచ్‌మేట్ రాచెల్ కోడిన్హోను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రాజశ్రీ యాదవ్‌గా పేరు మార్చుకున్నారు. రాజశ్రీ యాదవ్‌ది హర్యానాలోని రేవారీ ప్రాంత వాసి. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఇక బహిరంగంగా కనిపించిన దృశ్యాలు చాలా అరుదు. కుమార్తె కాత్యాయిని మార్చి 2023లో జన్మించారు. ఇక మే నెలలో కుమారుడు జన్మించాడు.
రాజ్‌బల్లభ్ యాదవ్.. ఆర్జేడీ మాజీ నేత. పోక్సో కేసులో తొమ్మిదిన్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. నవాడా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తేజస్వి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!