అగ్ర రాజ్యం అమెరికాకు వెళ్లిన కొంత మంది భారతీయ మహిళలు పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. జూలైలో ఓ స్టోర్‌లో దొంగతనం చేస్తూ భారతీయ మహిళ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. తాజాగా మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వస్తువులను చోరీ చేసి బయటకు వెళ్లిపోతుండగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bihar: ఓ కాంగ్రెస్ ఎంపీ ఓవరాక్షన్.. గ్రామస్తుడి భుజంపైకి ఎక్కి వరదలు పరిశీలన.. వీడియో వైరల్
గుజరాత్‌కు చెందిన ఓ మహిళ.. టార్గెట్ స్టోర్ నుంచి వస్తువులను దొంగిలించి బయటకు వెళ్లిపోతుండగా సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. జనవరి 15న జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bihar: తేజస్వి యాదవ్ భార్యపై ఓ మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు.. బీహార్‌లో ఆర్జేడీ నేతల ఆందోళన
అధికారులు ఆమెను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుండగా ఏడుస్తూ కనిపించింది. చేతులెత్తి దండం పెడుతూ.. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడింది. వస్తువులను దొంగిలించినట్లు నిందితురాలు నేరాన్ని అంగీకరించింది. అయితే భయాందోళనకు గురై కంగారు పడిపోయింది. ఇక అధికారి ఆమెతో మాట్లాడుతూ.. ఇప్పుడు బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నాడు. శాంతించాలని విజ్ఞప్తి చేశాడు. ఇంగ్లీషు వచ్చా? అని అడిగితే అంత బాగా రాదని సమాధానం ఇచ్చింది. ప్రాథమిక భాష గుజరాతీ అని చెప్పుకొచ్చింది. ఇక విచారణ సమయంలో దొంగిలించిన వస్తువులను చూపించారు. ఒక బండిలో వేసుకుని బయటకు వెళ్లిపోతుండగా పట్టుకున్నారు.
ప్రస్తుతం తన దగ్గర వాషింగ్టన్ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉందని నిందితురాలు వెల్లడించింది. ఇలా చోరీ చేస్తూ పట్టుబడడం ఇదే తొలిసారి. దొంగిలించిన వస్తువులు బయట అమ్మాలని అనుకున్నట్లు ఒప్పుకుంది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకు హాజరుకావాలని చెప్పారు.
ఇక జూలైలో కూడా ఇల్లినాయిస్‌లోని టార్గెట్ స్టోర్ నుంచి సుమారు రూ.1.1 లక్షల విలువైన వస్తువులను మరో భారతీయ మహిళ దొంగిలించింది. స్టోర్ లోపలో ఏడు గంటల పాటు ఆమెను విచారించారు. అనంతరం క్షమాపణ చెప్పింది. అనంతరం అధికారులు ఆమెకు సంకెళ్లు వేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.