భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వందే భారత్ స్లిపర్ రైలును దీపావళికి ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పైగా దీపావళి పండుగకు పెద్ద ఎత్తున బీహారీయులు తరలివెళ్తారు. ఇంకోవైపు నవంబర్‌లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ఢిల్లీ-పాట్నా రూట్‌లో వందే భారత్ స్లిపర్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: US: ఓ భారతీయ మహిళ పిచ్చిచేష్టలు.. స్టోర్‌లో చోరీ చేస్తూ పట్టివేత
దీపావళి సమయంలో ఢిల్లీ-పాట్నా అత్యంత రద్దీగా ఉండే కారిడార్‌లో ఇదొకటి. దీపావళి పండుగకు కచ్చితంగా లక్షలాది మంది ప్రజలు బీహార్‌కు ప్రయాణిస్తుంటారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసివెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో రైల్వే వ్యవస్థలో మొట్టమొదటి వందే భారత్ స్లిపర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టబోతుంది. కేవలం రాత్రిపూట ప్రయాణం కోసమే ఈ సర్వీస్ నిర్వహిస్తోంది. ఢిల్లీ-పాట్నా రూట్‌లో ప్రయాగ్‌రాజ్‌ను కలుపుకుని వెళ్తుంది. ఈ రైలు ప్రయాణ సమయాన్నికూడా తగ్గిస్తుంది. ఇక విమాన శైలి సౌకర్యాన్ని అందించనుంది.
ఇది కూడా చదవండి: Bihar: తేజస్వి యాదవ్ భార్యపై ఓ మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు.. బీహార్‌లో ఆర్జేడీ నేతల ఆందోళన
మామూలుగా ఎక్స్‌ప్రెస్‌లకు 23 గంటల సమయం పడుతుంది. ఈ వందే భారత్ స్లిపర్ రైలు మాత్రం కేవలం 11 గంటలకే తీసుకెళ్లిపోతుంది. అంటే దాదాపు 12-17 గంటల సమయం ఆదా అవుతుంది. ఈ సర్వీసు ఢిల్లీలో రాత్రి 8 గంటలకు ప్రారంభమైతే.. ఉదయం 7:30 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరిగి పాట్నాలో రాత్రి 8గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. భద్రతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునిక సౌకర్యాల సూట్‌తో అమర్చారు. సీసీటీవీ నిఘా ఉంటుంది. వినోద తెరలు ఉంటాయి. సెన్సార్ తలుపులు ఉంటాయి. అగ్నిమాపక వ్యవస్థ ఉంది. విమానంలో ఉండే ఇంటీరియర్ సౌకర్యాలు ఉంటాయి.
ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లు పగటిపూట ప్రయాణానికి అనుకూలంగా ఉండే చైర్-కార్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. కొత్తగా వచ్చే స్లిపర్ రైళ్లు రాత్రిపూట కోసమే వినియోగించనున్నారు. ఇక ఈ రైళ్లు సుదీర ప్రయాణాలకు మాత్రం వినియోగించనున్నారు.