టెక్సాస్‌లోని డల్లాస్‌లో భారతీయ సంతతికి చెందిన చంద్రమౌళి నాగమల్లయ్యను అత్యంత దారుణంగా క్యూబా జాతీయుడు హత్య చేశాడు. పరిగెత్తించి.. వెంటాడి భార్య, పిల్లల ఎదుటే నాగమల్లయ్యను శిరచ్ఛేదనం చేశాడు. అనంతరం తలను చెత్త బుట్టలో వేసి నిందితుడు పారిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Puja Khedkar: కొత్త చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్
తాజాగా నాగ మల్లయ్య హత్యపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. మోటెల్ మేనేజర్ తల నరికిన వాడిని కఠినంగా శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇక మెతకగా ఉండే సమయం ముగిసిపోయిందని.. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైడెన్ ప్రభుత్వ అలసత్వం కారణంగానే క్యూబా జాతీయుడు అమెరికాలో ఉంటున్నాడని.. అతడి కారణంగా భారతీయుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడని చెప్పారు. నిందితుడు యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్‌పై ఫస్ట్ డిగ్రీ హత్య నేరం మోపుతామని తెలిపారు. ఇదంతా బైడెన్ ఇమ్మిగ్రేషన్ విధానం వల్లే జరిగిందని దుమ్మెత్తిపోశారు. అక్రమ వలసదారులపై కఠినంగా ఉండుంటే ఈ ఘోరం జరిగేది కాదని పేర్కొన్నారు. అలాంటి దుర్మార్గుడిని అమెరికా రానివ్వడమే తప్పు అన్నారు.
ఇది కూడా చదవండి: Jharkhand: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోల హతం.. ఒకరిపై రూ.కోటి రివార్డ్
గతంలోనే నిందితుడికి నేర చరిత్ర ఉందని.. అయినా కూడా అతడు బయట తిరుగుతున్నాడని..దీనికి బైడెన్ విధానాలే కారణంగా పేర్కొన్నారు. నిందితుడు మార్టినెట్‌పై పిల్లలపై లైంగిక వేధింపులు, దొంగతనాలు వంటి కేసులపై జైల్లో ఉన్నాడని.. తీవ్రమైన నేరచరిత్ర కలిగిన వ్యక్తి ఎలా విడుదలయ్యాడని ప్రశ్నించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. హత్య తర్వాత డల్లాస్ దిగ్భ్రాంతికి గురైందన్నారు. నాగ మల్లయ్యకు మంచి పేరు ఉందని.. ఆ ప్రాంతంలో గౌరవనీయంగా బ్రతుకుతున్నాడని ప్రశంసించారు. ఇకపై అక్రమ వలసదారులపై కఠిన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.
