ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు.. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.