Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన టీడీపీ, జనసేన పార్టీలు.. అందుకు సంబంధించిన ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఇక, ఇరు పార్టీల నేతల సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశంలో అయ్యారు.. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.. సీట్ల సర్దుబాటుపై తొలిసారిగా ప్రాథమిక స్థాయిలో చంద్రబాబు-పవన్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఎన్నెన్ని సీట్లల్లో పోటీ చేయాలి..? ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలనే అంశంపై మల్లగుల్లాలు నడుస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోవాలని భావనలో ఇద్దరు నేతలు ఉన్నారట.. పూర్తి స్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై కూడా సమీక్ష చేసుకున్నారట.. ఇక, త్వరలో భేటీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది.. ఈ నెలాఖరు లోగా ఒకట్రొండు బహిరంగ సభలు పెట్టాలనే దాని పై కూడా తర్జన భర్జన పడుతున్నారట నేతలు.
Read Also: Kia Sonet facelift: ADAS ఫీచర్లతో కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. ఈ నెల 14న ఆవిష్కరణ..
టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ నవంబర్ 4వ తేదీన భేటీ అయ్యారు. తరచూ సమావేశమై ఉమ్మడి మ్యానిఫెస్టో సహా పొత్తు ప్రక్రియపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, పలు కారణాలతో ఈ భేటీ ఆలస్యమైంది. ఈ క్రమంలోనే బుధవారం భేటీయైన ఇరువురు నేతలు ఉమ్మడి మ్యానిఫెస్టో మీద చర్చించినట్లు తెలుస్తోంది.. ఇక, 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని గతంలో నిర్ణయించాయి టీడీపీ-జనసేన.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సమయంలో.. చంద్రబాబును పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన పొత్తు మీద ప్రకటన చేశారు. ఆ తర్వాత ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనకు రెండు పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి మ్యానిఫెస్టో కోసం కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనలో టీడీపీ ఆరు అంశాలను ప్రతిపాదించింది. ఇక జనసేన ఐదు అంశాలను ప్రతిపాదించగా.. 11 అంశాలతో మినీ మ్యానిఫెస్టో రూపొందించారు. వివిధ వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి మ్యానిఫెస్టో రూపొందించాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.