Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కంటే ఎక్కువగానే సీట్లు సాధించింది.. ఆ తర్వాత సీఎల్పీ లీడర్ ఎన్నిక.. పార్టీ అధిష్టానం పెద్దల మంతనాలు హాట్ హాట్‌గా సాగిన తర్వాత.. సీఎల్పీ లీడర్‌ను అధికారికంగా ప్రకటించింది అధినాయకత్వం.. దీంతో.. రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే రేవంత్ ప్రమాణస్వీకారానికి మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా.. కాంగ్రెస్ అగ్రనేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇదే సమయంలో రేవంత్‌కు.. కాంగ్రెస్ నేతలకు శుభాకాంక్షలు చెబుతూ తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి.. ఇవి తెలంగాణనే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని చోట్ల దర్శనమిస్తున్నాయి..
Read Also: CM YS Jagan: రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, సీతక్క ఫొటోలతో ఓ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. జువ్వలపాలెం రోడ్ లో రేవంత్ రెడ్డి, సీతక్క ఫ్లెక్సీలను పివిటి బ్రదర్స్ పేరుతో ఏర్పాటు చేశారు.. ఫ్లెక్సీలో చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోతో పాటు, చంద్రబాబు, సీతక్క కలిసి ఉన్న ఫోటోలను పొందుపరిచారు. “తెలుగుదేశం అనే యూనివర్సిటీ నుంచి వచ్చి తెలంగాణ ప్రజల మనసులు గెలిచి” రేవంత్ రెడ్డి అనే నేను.. సీతక్క అనే నేను.. మాటకోసం.. అంటూ ఫ్లెక్సీలో మ్యాటర్ రాసుకొచ్చారు.. ఫ్లెక్సీ బ్యాక్ గ్రౌండ్ లో రిటర్న్ గిఫ్ట్.. బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ ఏర్పాటు చేశారు. మీ పివిటి బ్రదర్స్ అంటూ జువ్వలపాలెం రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ ప్లెక్సీ ని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.. ఇది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్‌గా మారిపోయింది.