పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్రెడ్డి, సీతక్క ఫొటోలతో ఓ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. జువ్వలపాలెం రోడ్ లో రేవంత్ రెడ్డి, సీతక్క ఫ్లెక్సీలను పివిటి బ్రదర్స్ పేరుతో ఏర్పాటు చేశారు..
నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న వందకు పైగా వెబ్సైట్లను కేంద్ర ప్రభుత్వ నిషేధించింది. ఈ వెబ్సైట్లు డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, మ్యూల్, అద్దె ఖాతాలను ఉపయోగిస్తూ మోసాలకు చేస్తున్నట్టు గుర్తించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వెబ్సైట్లపై కేంద్ర ఐటీ శాఖ చర్యలు చేపట్టింది.
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా ఉంది.. నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తప్పు అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాజీ ఎన్నికల కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు రేవంత్రెడ్డి.. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు.. తెలంగాణ ప్రజలకు అభినందనలు.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది అన్నారు