రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్.. మంత్రులు ఎవరు, ఎల్లుండి ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనే విషయాలు తర్వాత చెబుతాం అన్నారు.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్గా పనిచేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీంతో.. తెలంగాణకు కాబేయో సీఎం రేవంత్రెడ్డి అనేది స్పష్టమైంది.. పీసీసీ చీఫ్ ని సీఎల్పీ నేత గా చేయాలని నిర్ణయించాం.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని.. అయితే, ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు అనేది తర్వాత చెబుతాం అన్నారు కేసీ వేణుగోపాల్.
కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిడ్డంతో పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్.. శివలింగపురం యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.. దీంతో, కేకే లైన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి
ఆంధ్రప్రదేశ్లో ఎస్సై నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. అభ్యర్థుల ఎత్తు కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించారు.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చింది హైకోర్టు.
తుఫాన్ తీవ్రత దృష్ట్యా ముందుగానే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 300 రైళ్లను రద్దు చేసింది.. ఇదే సమయంలో.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు.