నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతాను అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పెట్టి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను.. యువత భవిష్యత్ కోసం పోరాడుతుంటే అవమానాలు, వెటకారాలు చేస్తున్నారు.. అయినా వాటిని భరించడానికి సిద్ధం అన్నారు. ఉత్తరాంధ్ర చైతన్యం కలిగిన నేల, అటువంటి చోట నుంచి వలసలు ఆగాలి అని ఆకాక్షించారు.
తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో తెలంగాణలో చూశామన్న ఆయన.. ఏపీలో టీడీపీ, జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదే అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారం కోసం కాదు ప్రతిపక్షం కోసం చంద్రబాబు జనసేనను కలుపు కున్నాడని.. ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నాడు.. ఎమ్మెల్యే కోసం పవన్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు.. వీరు ఇద్దరూ కలిసి…
రైతులు ధైర్యంగా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తాం అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. అత్యధికంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వర్షపాతం నమోదైంది.. ఈ తుఫాన్ తో రైతాంగం పంటలు కోల్పోయారు.. మిర్చి, అరటి, పత్తి , బెంగాల్ గ్రామ్ పంటలు పూర్తిగా పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు.. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి..
ఈ నెల 9న జరగాల్సిన సమగ్ర కుల గణన మిచౌంగ్ తుఫాన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ..