IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
- జింబాబ్వేపై మూడో టీ20లో భారత్ 92 పరుగుల తేడాతో ఘన విజయం
- మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్
- భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు
- జింబాబ్వే 124/7కే పరిమితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND-W vs ZIM-W: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 92 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
భారత్ భారీ స్కోరు చేయడంలో హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలి వర్మ కీలక పాత్ర పోషించారు. హర్మన్‌ప్రీత్ కేవలం 41 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 91 పరుగులు చేసింది. షఫాలి 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు సాధించింది. దీంతో భారత్ 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెలిస్ న్ధ్లోవు ఖాతా తెరవకుండానే తొలి బంతికే ఔటైంది. అయితే షార్నే మేయర్స్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి పోరాడింది. బెలవ్డ్ బిజా 44 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.
Also Read
- Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
- Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
- IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
- PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
భారత బౌలర్లలో నందని శర్మ చేసి 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ తీశారు. దీంతో జింబాబ్వే 124/7కే పరిమితమై 92 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కొన్ని అరుదైన రికార్డులు కూడా నమోదయ్యాయి. జింబాబ్వే తరఫున కెలిస్ న్ధ్లోవు మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక డకౌట్ల రికార్డును 9 డకౌట్లతో నమోదు చేసింది. షార్నే మేయర్స్ ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు బాదడంతో జింబాబ్వే మహిళల తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కలిపి 339 పరుగులు చేయడం కూడా రికార్డుగా నిలిచింది. జింబాబ్వేపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ మూడు విజయాలు సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Superb bowling 🤝 Good fielding
🎥 Nandni Sharma’s twin strikes, ft. Prema Rawat’s fine catch in the deep 🫴☝️
Updates ▶️ https://t.co/JQfrsq5B2K
#TeamIndia | #INDvZIM | @mflone_ https://t.co/ZwimuIFol2
— BCCI Women (@BCCIWomen) October 20, 2026
𝗧𝗶𝗺𝗯𝗲𝗿 𝗦𝗧𝗥𝗜𝗞𝗘 \|/
🎥 What a way to get your 5️⃣0️⃣th T20I wicket 👌
Updates ▶️ https://t.co/JQfrsq5B2K
#TeamIndia | #INDvZIM | @mflone_ https://t.co/k1PjWpzItc
— BCCI Women (@BCCIWomen) October 20, 2026
తాజావార్తలు
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!