CM Chandrababu: ఏపీ సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ.. పెట్టుబడులపై కీలక నిర్ణయం..
- సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ..
- పారిశ్రామిక అభివృద్దికి సూచనలు.. సలహాల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్..
- చైర్మన్‌గా సీఎం చంద్రబాబు..
- టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్.. పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కానుంది.. సీఎం చంద్రబాబు చైర్మన్‌గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు.. పారిశ్రామికాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది.. ఇక, అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం.
Read Also: National Awards: బెస్ట్ తెలుగు సినిమాగా కార్తికేయ 2.. బెస్ట్ నటుడిగా రిషబ్ శెట్టి
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఈ సంస్థ ఏర్పాటులో భాగస్వామికానుంది టాటా గ్రూప్. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై టాటా గ్రూప్ ఛైర్మన్‌తో చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చాయి.. 2047 నాటికి ఏపీని నంబర్ వన్ ప్లేస్‌లో నిలపడమే లక్ష్యంగా చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ @ 2047 ఆర్థికాభివృద్ధి కోసం టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.. చంద్రశేఖరన్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు కో-ఛైర్‌గా ఉంటారని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను అన్నారు.. ఎయిర్ ఇండియా, విస్తారాతో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచే అంశంపై చంద్రశేఖరన్ తో చర్చించాం. వివిధ రంగాలలో అనేక ఇతర కంపెనీల భాగస్వామ్యం కల్పించే అంశం పైనా చర్చించామని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..