Nandamuri Balakrishna: పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుంది.. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవ్వడం ఒక పండగ లాంటిది అన్నారు నటసింహా, హిందపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతన్ పాల్గొన్నారు.. అన్న క్యాంటిన్‌ను ప్రారంభించిన తర్వాత అల్పాహారాన్ని స్వయంగా వడ్డించారు బాలయ్య.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పేదల ఆకలి తీర్చేందుకు అప్పట్లో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు..
Read Also: SSLV D3: ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో..
ఇక, నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి అని సంతోషాన్ని వ్యక్తం చేశారు బాలకృష్ణ.. పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుందన్న ఆయన.. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవ్వడం ఒక పండగ లాంటిది అని పేర్కొన్నారు.. సీఎం చంద్రబాబుకు హిందూపురం అంటే ప్రత్యేక అభిమానం ఉందన్నారు బాలయ్య.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారు.. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తాం అని ప్రకటించారు సినీ హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..