అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు.. అల్లూరి ఏజెన్సీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ తీరం దాటింది. ఏపీలోని బాపట్ల సమీపంలో తుఫాన్ తీరం దాటిన సమయంలో బీభత్స వాతావరణం కనిపించింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హోరెత్తింది. సముద్రంలో అలలు... ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగిసిపడ్డాయి. అల్లవరం సమీపంలో సముద్రం అలకల్లోలంగా మారింది.
రేవంత్రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్రెడ్డి.. ఏం మాట్లాడినా.. ఏ పార్టీలో ఉన్నా.. ఏం చేసినా సెన్సేషన్. తెలంగాణ రాజకీయ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న నాయకుడు. రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్కు సరికొత్త ఊపిరిలూదిన నేత.. జడ్పీటీసీగా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించి నేడు రాష్ట్ర అధినేతగా మారారు.