ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది.. ప్రెస్మీట్ పెట్టి మరీ.. మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు నేతలు.. అయితే, వ్యతిరేక వర్గాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు ఒకరని సస్పెండ్ చేయించిన రోజాకు.. ఇప్పుడు ఊహించని రీతిలో రివర్స్ షాక్ తగులుతోంది.
ఈ నెల 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో.. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్, ఆంక్షలు విధించారు పోలీసులు.. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉండనున్నాయి.. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి…
ఈ రోజు ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న జగన్.. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులో పర్యటిస్తారు.. స్థానిక బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు హాజరై సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.. ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో జగన్ పర్యటన కొనసాగనుంది.. గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి