Khammam Crime: మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో కొన్ని ఘటనలు చూస్తుంటే అర్థం కావడం లేదు.. ఆస్తుల కోసం, భూముల కోసం.. తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా కాటికి పంపిస్తున్నారు కొందరు దుర్మార్గులు.. తాజాగా, అక్క పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపిన తమ్ముడి ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది..
Read Also: EPFO: ఆధార్ కేవైసీ ఉంటే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ 2021 మే 5న మృతిచెందగా.. ఆమెది సాధారణ మరణం కాదని బంధువులు అనుమానించారు. తన తమ్ముడు కోమటి వెంకటేశ్వరరావు.. అక్క పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్‌లో విషమిచ్చి చంపాడని ఆరోపిస్తూ ఆమె అన్నలు కోమటి నాగేశ్వరరావు, కోమటి ముత్తయ్యలు వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టటంతో సోమవారం వచ్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూల్ డ్రింక్ లో ఫాయిజన్ వున్నట్లుగా తేలింది.. దీంతో.. సత్తుపల్లి రూరల్ సీఐ వెంకటేష్ ఆద్వర్యంలో.. నిందితుడు కోమటి వెంకటేశ్వరరావు పై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసి.. సత్తుపల్లి కోర్టులో హాజరు పర్చారు. ఇక, నిందితుడికి 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు.. ఆ తర్వాత సత్తుపల్లి సబ్ జైల్‌కు తరలించారు.. మూడు సంవత్సరాల తరువాత హత్య కేసులో ఫారెన్సీక్ నివేదిక ఆధారంగా నిందితుడుని పోలీస్ లు రిమాండ్ కు తరలించారు పోలీసులు..