CM Chandrababu: కాసేపట్లో తిరుమలకు సీఎం చంద్రబాబు.. రేపు శ్రీవారి దర్శనం
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
- ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్న చంద్రబాబు
- నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి రేపు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
- రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి.. సాయంత్రం 4.41 గంటలకు చాంబర్ లో బాధ్యతల స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు.. నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. అనంతరం మళ్లీ అమరావతి రాబోతున్నారు.. ఇక, రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి. సాయంత్రం 4.41 గంటలకు చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు.. ముఖ్యమంత్రిగా సచివాయంలోని మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు చంద్రబాబు. బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు..
Read Also: Mohan Charan Majhi: ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం..
Also Read
కాసేపట్లో కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు.. ఈ రోజు రాత్రి తిరుమలలోని గాయత్రి నిలయం అతిథిగృహంలో బస చేయనున్న ఆయన.. రేపు అంటే గురువారం ఉదయం 7.30 గంటలకు సీఎం హోదాలో కుటుంబసమేతంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి అడుగుపెట్టనున్నారు.. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత రంగనాయక మండపంలో వేదపండితుల ఆశీర్వచనం అందుకుంటారు సీఎం చంద్రబాబు.. తిరిగి 8.20 గంటలకు అతిథిగృహానికి చేరుకుని ఉదయం 9 గంటలకు తిరుమల నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!