CM Chandrababu Naidu: మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు.. ఎవరికి ఏ శాఖ అంటే..?
- ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
- చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులను కూడా ప్రమాణస్వీకారం
- మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు
- 24 మందిలో ఆరుగురికి మాత్రమే గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం
- సాయంత్రానికి శాఖల కేటాయింపు చేసే అవకాశం
- పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖ కేటాయిస్తారని ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు.. కేబినెట్ మంత్రులను కూడా ప్రమాణస్వీకారం చేయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది.. ఇక. మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు కొనసాగిస్తున్నారు సీఎం చంద్రబాబు.. 24 మందిలో ఆరుగురికి మాత్రమే గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.. అయితే, సాయంత్రానికి శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. హోం, ఇరిగేషన్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖలను సీనియర్లకు కేటాయించే ఛాన్స్ ఉందంటున్నారు..
Read Also: Apple CEO: యాపిల్ సీఈఓతో 13 ఏళ్ల భారతీయ బాలుడు.. ఫొటో వైరల్
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖల కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది.. గతంలో ఐటీ శాఖ చూసిన నారా లోకేష్.. తిరిగి అదే శాఖతో పాటు విద్యా శాఖ ఇస్తారని చర్చ నడుస్తోంది.. ఆర్థిక శాఖను ఆనం రామనారాయణరెడ్డి లేదా పయ్యావుల కేశవ్‌కు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఇక, పట్టణాభివృద్ధి శాఖ ను సీఎం వద్ద లేదా నారాయణకు కేటాయిస్తారని చర్చ కూడా ఉంది.. గతంలో పట్టణాభివృద్ధి శాఖలో భాగంగా అమరావతి నిర్మాణ బాధ్యతలు చూశారు నారాయణ. మైనారిటీల సంక్షేమం శాఖను ఫరూక్ కు కేటాయించే అవకాశం ఉండగా.. గిరిజన సంక్షేమ శాఖను గుమ్మడి సంధ్యా రాణికి ఇచ్చే ఛాన్స్ ఉంది.. సాంఘిక సంక్షేమ శాఖను డోలా బాలవీరాంజనేయ స్వామి లేదా అనితకు ఇస్తారని ప్రచారం సాగుతోంది.. గతంలో బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు చూశారు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర.. ఇలా మంత్రులకు శాఖలపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. కానీ, ఫైనల్ ఎవరికి ఏ శాఖలు దక్కుతాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!