Telangana: తెలంగాణలో సమాచార కమిషనర్ల నియామకానికి సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. దీని కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.. అర్హులై, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచింది.. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు.. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి.. రిజిస్టర్ పోస్ట్ కూడా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక, దీనికి సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని https://telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు.. మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలోనూ దరఖాస్తులను స్వీకరించారు అధికారులు.. అయితే, గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సీఎస్..