మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్.. బుగ్గనకు దమ్ముంటే బేతంచర్లలో మెజార్టీ తెచ్చుకోవాలన్నారు.. బుగ్గన సొంత వార్డులోనే టీడీపీ జెండా ఎగురవేశాం.. కేఈ, కోట్ల కుటుంబాలు గూగుల్ లో కనపడకుండా చేస్తామన్నారు మంత్రి బుగ్గన అంటున్నారు.. గూగుల్ తల్లిని సృష్టించింది మేమే అన్నారు.
ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు తెలిపిన ఈసీ.. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొంది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది.. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసం వెళ్లి బ్యాంక్ ముందు కుప్పకూలిన వృద్దుడు అక్కడికక్కడే కన్నుమూశాడు.. మృతుడు సుబ్బన్న (80)గా గుర్తించారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకుకు చెందిన ముద్రగడ సుబ్బన్న.. పెన్షన్ కోసం వెళ్లి.. బ్యాంకు వద్ద కుప్పకూలి మృత్యువాత పడ్డారు