ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు.. రేపు మరోసారి ఏపీకి రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీలో పర్యటించబోతున్నారు.
కొడాలి నానిని తిట్టాలని నాకు ఏమీ లేదు అన్నారు పవన్ కల్యాణ్.. నాకు వ్యక్తిగతంగా కొడాలి నానితో ఏ శత్రుత్వం లేదన్నారు.. అయితే, వంగవీటి రాధా వివాహంలో కొడాలి నాని కనపడితే కలిశాను అని గుర్తుచేసుకున్నారు.. కానీ, కొడాలి నాని నోరు పారేసుకునే ఎమ్మెల్యే అని విమర్శించారు.. నాని నోరు కట్టడి చేయాలి అంటే రాముని గెలిపించాలని గుడివాడ ప్రజలకు పిలుపునిచ్చారు.
జగన్ భూములు ఇచ్చేవాడే కానీ.. లాక్కునేవాడు కాదు అని స్పష్టం చేశారు సీఎం జగన్.. అసలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా? అని నిలదీశారు. భూమిపై సంపూర్ణ హక్కులు ఇవ్వడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని స్పష్టం చేశారు.. ఏ భూమి ఎక్కడ కొనాలన్నా వివాదాలు ఉన్నాయి.. వీటన్నింటి వల్ల భూ వివాదాలు పెరుగుతున్నాయి.. ఏ రైతన్న కూడా తమ భూముల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు.. భూమిపై ఎటువంటి వివాదం లేకుండా ప్రభుత్వం టైటిల్ ఇన్సూరెన్స్…
అనకాపల్లి లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి దగ్గర ఓ డ్రోన్లు కలకలం సృష్టించింది.. దేవరపల్లి మండలం తారువ గ్రామంలో డిప్యూటీ సీఎం ఇల్లు, రాకపోకలు సాగించే మార్గంలో అగంతకులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు.. ఓ కారు, రెండు బైక్ ల పై వచ్చిన అగంతకులు ముత్యాలనాయుడు ఇల్లు, పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిదే విజయం.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.. బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్.. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయేన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం అన్నారు..