Deep Depression: భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే ఒడిశాలోని పూరీ దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. భూ ఉపరితలంపై అదే తీవ్రతతో ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగుతూ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. ఇక, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.. ఈ నేపథ్యంలో.. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, మన్యం పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.. మరోవైపు.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు ఉమ్మడి కృష్ణ జిల్లాలకు ఎల్లో బులెటిన్ వార్నింగ్ జారీ అయ్యాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం వున్నందున అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచిస్తోంది.
Read Also: CM Revanth Reddy: ఐఐహెచ్‌టీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు.. అధికారులకు సీఎం ఆదేశాలు..