CM Chandrababu: భారీ వర్షాలు.. 9వ రోజు సహాయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్..
- భారీ వర్షాలు.. వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు సహాయక చర్యలపై సమీక్ష..
- కలెక్టర్లు.. ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్నసహాయక చర్యలు.. మరోవైపు భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.. మరోవైపు.. బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గింది. ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు నీటి నుంచి బయట పడతాయి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు..
Read Also: Bandi Sanjay: నేను హైడ్రాకి సపోర్ట్ చేశా.. ఇప్పుడు విశ్వాసం పోతుంది..
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్స్ ను ఉపయోగించండి.. కాలువల్లో వరద ప్రవాహాలు, గట్లు పటిష్టతను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయండి అని సూచించారు సీఎం చంద్రబాబు.. విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్దరణ పూర్తి అయ్యిందని తెలిపిన అధికారులు.. అయితే, అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.. మెడికల్ క్యాంపులు కొనసాగించాలని సూచించారు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన 5 టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. భారీ వర్షాలు కురిసిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు.. ఎర్రకాల్వకు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలన్నారు..
Read Also: Heavy Rains: భారీ వర్షాలు.. విలీన మండలాలు అతలాకుతలం..
ఇక, ఏలేరు రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ ఫ్లో… అవుట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు అన్నారు. ఏలేరు రిజర్వాయర్ కెనాల్స్ పరిధిలో గండ్లు పడే అవకాశం ఉన్న 3 ప్రదేశాలను గుర్తించామని సీఎం దృష్టికి తీసుకొచ్చిన కలెక్టర్.. తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. ధవళేశ్వరం వద్ద నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, నీటి ప్రవాహం తగ్గడంతో అది ఉపసంహరించామని సీఎంకు తెలిపారు తూర్పుగోదావరి కలెక్టర్… విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించిన జిల్లా కలెక్టర్లు..
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!