ప్రేమ అంటూ వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుందామని ప్రమోజల్ పెట్టాడు.. ఆ ప్రేమ నిజమేనని నమ్మిన ఆమె.. ప్రియుడినే పెళ్లి చేసుకుంది.. కొంత కాలం అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత మరో మహిళతో ఉండసాగాడో వ్యక్తి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని.. మహిళా కానిస్టేబుల్‌తో విడిగా కాపురం పెట్టాడు.. ఇది పసిగట్టిన భార్య.. ఆ ఇంటి ముందు తిష్టవేసి.. భర్త బండారాన్ని బయటపెట్టింది.. రెడ్ హ్యాండెడ్‌గా పెట్టుకుని.. పోలీసులకు అప్పగించింది.. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు క్యూ కట్టారు ప్రజలు.. అయితే, భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లోకేష్.. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.
వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత మీకు లేదంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు.. ఆనాడు చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీ వెళ్లి వెలిగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశామని గుర్తుచేసుకున్నారు..
శ్రీశైలం మహాక్షేత్రం మరోసారి చిరుత కలకలం సృష్టిస్తోంది.. ఈ మధ్య తరచూ చిరుతల సంచారంతో స్థానికులతో పాటు భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.. స్థానిక నీలం సంజీవరెడ్డి భవనం దిగువన ఉన్న గేటు వద్ద నిన్న రాత్రి చిరుత పులి సంచరించడం స్థానికంగా కలవరపెడుతుంది.. నిన్న రాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువన గేటు ముందు చిరుతపులి నిలుచొని చూస్తున్న దృశ్యాలను కొందరు భక్తులు గమనించారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి.. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ.. కక్ష సాధింపు చర్యలు.. నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని.. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ కేటుగాడు. పోలీసునని చెప్పి డబ్బులు అవసరమని తనకు ఫోన్ పే చేస్తే కానిస్టేబుల్ ద్వారా క్యాష్ పంపిస్తానని వ్యాపారులను నమ్మబలికి బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే వ్యాపారస్తులు చాకచక్యంగా ప్రవర్తించడంతో కేటుగాడి వలకు చిక్కలేదు.
ఈ రోజు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యారణం శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. రాష్ట్రంలో చేపట్టబోతున్న నరేగా పనులు, ఈ నెల 23వ తేదీన గ్రామసభల నిర్వహణపై ముఖ్యంగా సమీక్షించను్నారు..
అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలు జారీ చేశారు.. హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా? లేదో? చూడాలని కలెక్టర్లకు సూచించారు సీఎం.. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు సురక్షితమా కాదా అన్న కోణంలోనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.