Shock to YSRCP: జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్..
- జగ్గయ్యపేటలో వైసీపీకి బిగ్ షాక్..
- టీడీపీలో చేరిన మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర..
- మున్సిపల్ చైర్మన్ తో పాటు టీడీపీకి గూటికి పలువురు కౌన్సిలర్లు..
- కండువాకప్పి టీడీపీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shock to YSRCP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా.. వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ గూటికి చేరుతున్నారు.. ఇక, పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు.. టీడీపీ కండువా కప్పుకోవడంతో.. పలు మున్సిపాల్టీలను సైతం తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. తాజాగా.. జగ్గయ్యపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు సైకిల్ పార్టీలో చేరారు.. వారికి కండువాకప్పి టీడీపీలోకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్.
Read Also: Darshan: జైల్లో ఉన్నా కొవ్వు కరగలేదే.. మీడియాకు మధ్య వేలు చూపించిన దర్శన్?
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
వైసీపీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు.. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు.. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ పడనివిధంగా భారీ వర్షాలు కురిసాయి. ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచిందన్నారు.. అయితే, వరదలోనూ జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!