Ganesh With Rs. 2.7 Crore Currency Notes: వినాయక చవిత వచ్చిందంటే చాలు.. వివిధ రూపాల్లో గణపయ్య మండపాలు.. అందులో కొలువుదీరే గణనాథుడి విగ్రహాలు దర్శనం ఇస్తుంటాయి.. కొన్ని ప్రాంతాల్లో బంగారు విగ్రహాలు పెడితే.. మరికొన్ని చోట్ల మట్టి గణపయ్యలను పూజిస్తారు.. ఇక, నచ్చిన నేత.. మెచ్చిన పార్టీలతోనూ సెట్లు ఏర్పాటు చేస్తుంటారు.. ఇక, ఎన్టీఆర్ జిల్లాలో అందరినీ అబ్బుర పరుస్తున్నాడు కరెన్సీ గణనాథుడు.. నందిగామ పట్టణంలోని వాసవి బజార్లో 42వ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని, రాజా దర్బార్ గణపతిని ఏర్పాటు చేసి నిత్య పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు శుక్రవారం గణపతి ఉత్సవాల్లో భాగంగా 2 కోట్ల 70 లక్షల నగదుతో కరెన్సీ వినాయకుని అందంగా అలంకరించారు కమిటీ వారు.
Read Also: Ford: ఫోర్డ్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..!
వినాయక మండపం మొత్తం కరెన్సీ నోట్లతో నింపేశారు.. గణపయ్యకు వేసే గజమాలల నుంచి మండపంలో టాప్ టూ బాటమ్.. మొత్తం కరెన్సీ నోట్ల కట్లతో తయారు చేసిన దండలతో నింపేశారు నిర్వాహకులు.. ఇక, వివిధ కలర్స్‌లోకి మారుతున్న నైట్లు మరింత ఆకర్షణగా ఉన్నాయి.. ఈ కరెన్సీ వినాయకుడిని సందర్శించడానికి భక్తులు క్యూ కడుతున్నారు. అనంతరం శ్రీనివాస శ్రీ కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుందని, ఈ రాత్రి కి15,000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఉందని ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని కమిటీవారు తెలిపారు.. మొత్తంగా రూ.2.70 కోట్ల కరెన్సీ కట్టల మధ్య గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.