కడప జిల్లాలో వైసీపీ అలర్ట్ అయ్యింది.. ఉమ్మడి కడప జిల్లాలోని జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది.. జిల్లాలోని జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు వెళ్లాయి..
బాలయ్య మంత్రాంగం ఫలించడంతో.. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోనుంది.. మున్సిపాల్టీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కూటమి బలం 20కి చేరింది.. దీంతో.. మున్సిపల్‌చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఇంద్రజ.. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు..
నేడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీకానున్న ఆయన.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు.. ఇక, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్.. పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురైంది.. గురువారం రాత్రి.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు అవినాష్.. అయితే, ఆయన్ని అడ్డుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు.
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు బాలయ్య.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.