సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ సర్వీసులోకి వచ్చే ఆలోచనలో ఉన్నారట.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్.. ఇక, ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు..
నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు.. వెంకయ్య నాయుడు ఆలోచనలు మహోన్నతమైనవి.. ఆయన తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని తెలిపారు.
మాజీ మంత్రి ఆళ్ల నాని.. వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. కొద్దిరోజుల క్రితం ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. నియోజకవర్గ ఇంఛార్జ్ పోస్టుకు రాజీనామా చేశారు ఆళ్ల నాని.. ఇక, ఈ రోజు వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత బాధ్యతలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
జగన్ కాని.. వైసీపీ ఎమ్మెల్యే లు కానీ.. మీడియాలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరితే సభాపతిగా తాను తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు..
దట్టమైన పొదల్లో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.. తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకుంది.. అమ్మ ఒడిలో సేదతీరుతూ హాయిగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి.. ఏకంగా రెండు రోజుల పాటు నరకం చూసింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది.. తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఓ తల్లి.. ఈ ఘటనలో ముగ్గురూ సజీవదహనం అయ్యారు.. ఈ ఘటనలో రమా (35) తల్లి.. ఇద్దరు పిల్లలు మను (7 ఏళ్ల బాబు), మన్విత (ఐదేళ్ల పాప) ప్రాణాలు విడిచారు..
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో బదిలీలు చేపట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, బదిలీల మార్గదర్శకాలపై తుది కసరత్తు జరుగుతోంది.. ఆఫీస్ బేరర్ల పేరుతో బదిలీలను తప్పించుకునేలా కొందరు వైసీపీ అనుకూల ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.. ఆఫీస్ బేరర్లకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి వెసులుబాటు కల్పించే జీవోను అడ్డం పెట్టుకుంటున్నారట పలువురు ఉద్యోగులు.