అచ్యుతాపురం ఘటన బాధాకరం అన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. కానీ, ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా నెపం మాపై నెట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరం అన్నారు.
అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశాం.. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు.. బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి.. అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైసీపీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాం. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందన్నారు.
అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు.. అయితే, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా బాధితులతోనూ మాట్లాడి సీఎం చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హమీ ఇచ్చారు. ఇక, ఈ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషేన్‌రాజు తన చాంబర్లో.. బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 5 బిలియన్ల యూఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ ఎవ్రెన్ ముందుకొచ్చింది. బ్రూక్‌ఫీల్డ్ , యాక్సిస్ యాజమాన్య బృందం.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దశలవారీగా 3500 మెగావాట్ల సోలార్ , 5500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవ్రెన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ రోజు హోం శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా.. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు.. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై క్రైం 152 శాతం, మిస్సింగ్ కేసెస్ 84 శాతం, సైబర్ క్రైం నేరాలు 134 శాతం పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.