వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని జోగి రమేష్‌కు ఇచ్చిన తాజా నోటీసుల్లో పేర్కొన్నారు మంగళగిరి పోలీసులు.
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపిలేని కుంభవృష్టి కురిసింది.. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు భారీ వర్షం పడింది.. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు.. ఎగువన అటవీప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైక్‌లు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే ఏపీలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే, దీనిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఈ రోజు రవాణాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదనంగా 2 వేల బస్సులు.. 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్నారు.. అదే విధంగా రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణ శాఖ చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలా..? వద్దా..? అనే అంశంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.
భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. భవనాల నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుండి వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మృతులు ప్రతాప్ రెడ్డి ( 22), ప్రమీల(21) ఘటనా స్థలంలోనే కన్నుమూయగా.. వెంకటమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు గుడ్‌న్యూస్ చెప్పింది.. స్థానిక సంస్థల కోసం రూ. 1452 కోట్ల నిధుల విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. గత ప్రభుత్వం పక్కదారి పట్టించిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.. గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ. 998 కోట్లు, అర్బన్ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ. 454 కోట్లు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ.