CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.. విపక్షాలు దానిపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఇసుకలో జోక్యం వద్దంటూ కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ఇచ్చారు చంద్రబాబు.. ఇక, వాలంటీర్ల గురించి పదే పదే మాట్లాడే జగన్.. పదవీ కాలం ఏడాది క్రితం పూర్తైనా పట్టించుకోలేదు. వాలంటీర్ల పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాలంటీర్లు పేరోల్స్‌లో లేకుండా పోయారు. వాలంటీర్లకు జగన్ ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు. తప్పుడు ప్రచారం ఎంత చేసినా.. ప్రజాస్వామ్యంలో మోసం చేయడం కష్టం. 151 సీట్లతో గెలిచి విర్రవీగిన వ్యక్తి.. 11 స్థానాలకే పరిమితమయ్యారు.. అదే ప్రజాస్వామ్య రహస్యం అన్నారు.
Read Also: Balineni Srinivasa Reddy: అక్కడే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా-బాలినేని
ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు అని స్పష్టం చేశారు చంద్రబాబు.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మన గెలుపునకు అదే దోహదం చేస్తుందన్నారు.. మూడు పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానాన్ని జయప్రదం చేసేలా సహకరించాలని కోరారు.. కొత్త మద్యం పాలసీ తెచ్చాం.. నాణ్యమైన మద్యాన్ని రూ. 99కే ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులతో పాటు.. మనం చేస్తున్న మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పోలవరాన్ని పూర్తి చేసి జాతికి, రైతులకు అంకితం చేయాలి. అమరావతికి పూర్వవైభవం తెస్తాం. కేంద్రం అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇస్తోంది.. ఇంకా మరింత ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతికి నిధుల కొరత లేదు అని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..