* నేటి నుంచి చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్‌లు.. ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్
* నేడు కాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. కత్రా-శ్రీనగర్‌లో నిర్వహించే ఎన్నికల మెగా ర్యాలీలో పాల్గొననున్న మోడీ..
* నేడు ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. రెండో విడత అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయం
* నేడు విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్.. దివ్యకళా మేళాకు హాజరుకానున్న గవర్నర్.. మేళాను ప్రారంభించనున్న కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్
* నేడు విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి భేటీ.. ఈ సమావేశం తర్వాత జనసేనలో ఎప్పుడు చేరతారన్నదానిపై స్పష్టత వచ్చే ఛాన్స్
* వరంగల్ జిల్లా: నేడు నర్సంపేటలో జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలను ప్రారంబించనున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* నేడు విశాఖలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ పర్యటన… ఏయూ మెరైన్ మైదానంలో జాతీయ స్థాయి దివ్య కళా మేళాను ప్రారంభించనున్న మంత్రి.
* నేడు విశాఖకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. విశాఖ వేదికగా జాతీయ స్థాయి దివ్య కళా మేళా.. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న గవర్నర్..
* అమరావతి : ఇవాళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ.. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ కానున్న ఇద్దరు నేతలు.. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని..
* ప్రకాశం : గిద్దలూరులో అన్నక్యాంటీన్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..
* తిరుమల: ఎల్లుండి డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు, వర్చువల్ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కార్యక్రమం.
* చిత్తూరు: నేటి నుంచి రెండు రోజుల పాటు మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన.. ఎన్నికల తరువాత తొలిసారిగా జిల్లాలో పర్యటిస్తున్న లోకేష్.. సాయంత్రం పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం గ్రామానికి చేరుకున్న లోకేష్.. రేపు ఉదయం బంగారుపాలెం గ్రామంలో పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన లోకేష్.. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
* అనంతపురం : ఇవాళ ఐఏబీ(నీటి పారుదల సలహా మండలి) సమావేశం. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీటి కేటాయింపులప్తె చర్చ. హాజరు కానున్న సీమ జిల్లాల ప్రజాప్రతినిథులు.
* అనంతపురం : జిల్లాలో పర్యటించనున్న మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్ యాదవ్ , సవితమ్మ.
* అనంతపురం : నేటి నుంచి చివరి రౌండ్ దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లు. భారత్ బీ జట్టులో సూర్యకుమార్ యాదవ్ కు చోటు. మ్తెదానం – 1లో భారత్ ఏ – భారత్ సీ జట్ల మధ్య మ్యాచ్.. మ్తెదానం – 2లో భారత్ బీ – భారత్ బీ జట్ల మధ్య మ్యాచ్.
* తిరుపతి: నేడు వెటర్నరీ కళాశాల 61వ వార్షికోత్సవ వేడుకలు
* అనంతపురం : అనంతపురం నగరంలోని మూడు ప్రాంతాల్లో అన్నక్యాంటీన్లు ప్రారంభించనున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
* అనంతపురం : అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటి ఆస్పుత్రిని సందర్శించనున్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి గోదావరి గట్టుపై హాస్య నటుడు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం
* నంద్యాల: వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నేడు 12 గంటలసేపు నిర్విరామంగా ఓంకారనాద ఉచ్చారణ
* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,690 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,086 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు
* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణంలో ‘ స్వచ్ఛతా హి సేవా ‘ కార్యక్రమం.. పాల్గొననున్న కూటమి ఎమ్మెల్యే సురేంద్ర బాబు. టీ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ