ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు.. గోద్రెజ్ సంస్థ సీఎండీ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది.. ఏపీలో పెట్టుబడులపై సీఎంతో గోద్రెజ్ ప్రతినిధులు సమాలోచనలు చేశారు.. పెస్టిసైడ్స్ తయారీ రంగంలో రూ. 2800 కోట్ల పెట్టుబడులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న ఆయన.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు..
అనధికారిక లేఅవుట్లపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అనధికారిక లేఅవుట్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలోని మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లేఅవుట్ల వివరాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు పక్కదారి పడుతోన్నారు పలువురు ఉద్యోగులు. బదిలీల నుంచి వెసులుబాటు కోసం వివిధ సంఘాల నుంచి ఆఫీస్ బేరర్ల లెటర్లు తీసుకుంటున్నారట పలువురు ఉద్యోగులు. ఆఫీస్ బేరర్లు కాకున్నా కొన్ని ఉద్యోగ సంఘాలు లేఖలు ఇచ్చేస్తోన్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. అనర్హులకు లేఖలు.. ఫేక్ ఆఫీస్ బేరర్ల లెటర్లపై సీరియస్ అయ్యింది..