Ramana Deekshithulu: శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చిన రమణధీక్షితులు టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరగడం మహా పాపం అన్నారు.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వామివారికి నివేదించే ప్రసాదాల నాణ్యత, పరిణామాలు దిట్టం మేరకు జరగడం లేదని గత ఐదు సంవత్సరాలుగా తాను టీటీడీ ఈవో.. చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన సరైన స్పందన లేదని.. ఇప్పటికైనా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం మంచి పరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు రమణ దీక్షితులు. కోవిడి కాలం నుంచి కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యం దిట్టం మేరకు చేయడం లేదని ప్రశ్నించిన తనపై గత ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టారని తనపై ఉన్న కేసులను తొలగిస్తే 50 సంవత్సరాల అనుభవంతో పాడైన అర్చక ఆలయ వ్యవస్థలను సరిదిద్దుతానని పేర్కొన్నారు రమణ దీక్షితులు. అయితే, పింక్ డైమండ్ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించిన రమణ దీక్షితులు.. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కల్పిస్తారన్న నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు.
Read Also: Israel Airstrike : హిజ్బుల్లా స్థావరాలపై విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్
రెండు రోజులుగా తిరుమల క్షేత్రంపై వస్తున్న వార్తలు చాలా బాధాకరం అన్నారు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు.. వేల సంవత్సరాలుగా ఆగమశాస్త్రం మేరకు కైంకర్యాలు జరుగుతున్న శ్రీవారి ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు.. స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో కల్తీ జరగడం చాలా పాపం.. ప్రసాదాల నాణ్యత, పరిణామాలు సరిగా లేవని అప్పటి ఈవో, చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదన్నారు.. గత ఐదు సంవత్సరాలుగా నేను ఒంటరి పోరాటం చేశాను.. నా తోటి అర్చకులు సహకరించలేదన్నారు.. తిరుమలలో ప్రక్షాలన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.. స్వచ్ఛమైన నెయ్యిని కర్నాటక డైరీ నుంచిసేకరణ చేయాలని టీటీడీ నిర్ణయించడం మంచి పరిణామంగా అభివర్ణించారు.. స్వామివారికి శుచిగా, రుచిగా ప్రసాద సమర్పణ చేస్తే దేశం సుభిక్షంగా వుంటుంది.. సేంద్రియ పదార్ధాలతో ప్రసాదాల చేయాలనే ప్రతిపాదన ఐదు సంవత్సరాల క్రితం నా వద్దకు వచ్చింది.. వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారానికి విరుద్ధంగా చేయడం సమంజసం కాదని వారికి తేల్చి చెప్పానన్నారు. అయితే, ఐదు సంవత్సరాల క్రితం వున్న విధానానే ప్రసాదాల తయారీలో అమలు చేయాలని సూచించారు.. 50 సంవత్సరాలు అనుభవం వుంది.. అవకాశం ఇస్తే పాడైన అర్చక, ఆలయ వ్యవస్థలను సరిదిద్దుతాను.. గత ప్రభుత్వం పెట్టిన కేసులు తొలగిస్తే.. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు రమణదీక్షితులు..