ఏపీ ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. గత ప్రభుత్వంలో జరిగిన పనులకు.. ఇప్పుడు బిల్లుల చెల్లింపులు చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది.. 2014-19 నాటి బిల్లులు పెండింగులో ఉండగానే.. గత ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
నిజామాబాద్ జిల్లాలో మటన్ ముక్కలు పంచాయితీ పెట్టాయి.. పెళ్లి విందులో రసాభాసకు కారణంగా మారాయి.. పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. అంతేకాదు.. 19 మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి..
తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు కీర్తించారు.. తేనెలొలుకు భాష.. మన తెలుగు భాష.. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో ఈ రోజు సీఆర్డీఏ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది.. రాజధాని నిర్మాణాల పునః ప్రారంభంపై కీలక చర్చ సాగనుంది.. వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు.. తమ పదవులతో పాటు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారా? ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైసీపీ లీడర్లకు చేరవేస్తున్నారా? ఇప్పుడు ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మంత్రులు.. సచివాయలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల్లో వైసీపీ అనుకూలురు ఉన్నారనే అంశంపై చర్చించారు..
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకుంది.. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు.. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇక, కేంద్రం నిర్ణయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వం, ప్రజల తరపున కేంద్ర…
తాడిపత్రి ఇసుక అక్రమ రవాణా పంచాయితీ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్దకు చేరింది.. తాడిపత్రి లో ఇసుక అక్రమ రవాణా వివాదం రాష్ట్రస్థాయిలో హీట్ ను రాజేసిన విషయం విదితమే కాగా.. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందా పలుమార్లు సీఐ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.