AP IT Policy: కొత్త ఐటీ పాలసీపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్.. అందులో భాగంగా ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రొత్సహాకాలు ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. ఐటీ సేవల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని ఏపీ సర్కార్ భావిస్తోంది.. ఐటీ సేవలు.. ఏపీ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపకల్పన చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.. ఐటీ రంగం ద్వారా భారీగా ఉపాధి కల్పించి.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల మందికి ఉపాధి హామీని నెరవేర్చేలా ప్రణాళిక రెడీ అవుతున్నాయి.. మరోవైపు.. ఈ రోజు మధ్యాహ్నం మున్సిపల్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. పట్టణాల్లో మౌళిక వసతుల కల్పన, హౌసింగ్, డ్రైనేజీ వ్యవస్థ, అనధికారిక లే అవుట్ల కట్టడి వంటి అంశాలపై మున్సిపల్ అధికారులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్