MLA Pulivarthi Nani: తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం కాకరేపుతోంది.. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీగా మారింది పరిస్థితి.. ఇక, ఈ రోజు, రేపు రెండు రోజుల తిరుమల పర్యటనకు సిద్ధం అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. దీంతో.. డిక్లరేషన్ వ్యవహారం చర్చగా మారింది.. మరోవైపు.. పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు.. ఇక, వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హాట్ కామెంట్లు చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.. గత కొంత కాలంగా జరుగుతున్న తిరుమల వివాదం తెలిసిందే.. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు.. కల్తీ నెయ్యి పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశించడం శుభపరిణామంగా పేర్కొన్నారు.
Read Also: Kolkata Tram: ముగిసిన 151 ఏళ్ల ప్రయాణం.. ఆసియాలోని ఏకైక ట్రామ్‌వే!
ఇక, మాజీ సీఎం జగన్.. శ్రీవారి దర్శనానికి వస్తున్నారు.. ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఎమ్మెల్యే నాని.. అయితే శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి నుంచి వైసీపీ నేతలతో పాటు రౌడీలు 10 వేల మందిని పోగుచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. వైఎస్ జగన్ దర్శనానికి వస్తున్నారా..? దేవుడిపై దాడికి వస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు.. తిరుమల దర్శనానికి వచ్చే వారు కొందరితో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు.. మరి ఇంత మందిని ఎందుకు పిలుస్తున్నారు..? అని నిలదీశారు.. అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.. దర్శనం పేరుతో తిరుమలకు వస్తున్న గూండాలను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.