విశాఖకు "వందేభారత్" రైళ్లు క్యూ కడుతున్నాయి. ఎల్లుండి నుంచి మరో కొత్త సర్వీసు ప్రారంభంకాబోతోంది.. భారతీయ రైల్వేలలో వాల్టేర్ డివిజన్ ది ప్రత్యేక స్థానం. విశాఖ జంక్షన్ మీదుగా రోజూ 120 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో లక్ష దాటుతుంది. అదే సెలవులు, పర్వదినాల్లో అయితే ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు. అయితే, డిమాండ్ కు అనుగుణంగా రైళ్ల ఫ్రీక్వెన్ని వుండటం లేదనే విమర్శలు బలంగా వుండేవి. కానీ, వందేభారత్ ఎంట్రీ తర్వాత విశాఖ రైలు ప్రయాణీకులకు వెసులుబాటు లభించింది... వివిధ గమ్యస్థానాలకు…
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి జిల్లా ఆస్పత్రి పనితీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన ఇయన.. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అయితే, ఆస్పత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడం, రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి అసహనం వ్యక్తం చేశారు..
వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ అన్నారు.. ఇది కరెక్ట్.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు... కాబట్టి అది జగన్ మేడ్ మిస్టేక్ అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి..
లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాగా స్పందించే మనసు ఉండాలి అన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగింది.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారు.. కానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో.. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు మంగళగిరి రూరల్ పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, విచారణకు సహకరించాలని వైసీపీ నాయకులకు షరతు పెట్టింది.. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేతలకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో కువైట్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతోన్న కవిత.. స్వదేశానికి చేరుకుంది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లికు చెందిన మహిళ తిరుపతి కవిత... బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడిన బాధితురాలు..
కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. అప్పగింతలు కూడా పూర్తయ్యాయో లేదో.. అప్పుడే ఆ నవ వధువు కలలు కల్లలయ్యాయి. ఏడు అడుగులు వేసి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను దురదృష్టం వెంటాడింది. పెళ్లైన ఐదు రోజులకే వరుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలోచోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వి. కోట పట్టణలో పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం.. అలానే ఆలయంలోని నంది విగ్రహానికి.. ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం లభించింది..