తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 'ప్రాయశ్చిత్త దీక్ష' చేపట్టిన విషయం విదితమే.. అయితే, తిరుమలలోనే దీక్ష విరమించేందుకు సిద్ధం అవుతున్నారు పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన విరమిస్తారు.
గుంటూరులో వెలుగు చేసిన నయా మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇంస్టాగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోమం అంటూ యువకులకు వల వేస్తున్నారు.. మీరు ఇంట్లో కూర్చొనే నెలకు 50,000 వేల వరకు సంపాదించుకోవచ్చు అంటూ ఓ ప్రకటన ఇచ్చారు.. తమను సంప్రదించిన యువకులకు.. అందమైన యువతీతో వీడియో సందేశాలు పంపించారు..
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 'ప్రాయశ్చిత్త దీక్ష' చేపట్టారు.. ఇక, అందులో భాగంగా ఈ రోజు ఇంద్రకీలాద్రిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.
విశాఖ డెయిరీ యాజమాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు... అయితే, విశాఖ డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్.. గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆనంద్.. అయితే, విశాఖ డెయిరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్.. రైతుల సొమ్ములతో డెయిరీ పాలకవర్గం సోకులు చేస్తోంది.. అవసరమైతే చైర్మన్ ను జైలుకు ఈడుస్తాం అని హెచ్చరించారు..
రాయచోటిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లో సంవత్సరం పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. రాయచోటిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మూడు పూటల ఆహారం అందిస్తామని.. ఇందుకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది. సుమారు రెండుగంటలుపైగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు. పొంగిపొర్లుతున్నాయి. మారేడుమిల్లిలో వాగులు పొంగి రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపీ పురంధేశ్వరిని నియమించారు.. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా.. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు పురంధేశ్వరి.. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.